ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్
17వ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ వీరేంద్ర కుమార్ ఎంపికయ్యారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వీరేంద్ర కుమార్ పేరును ఖరారు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమాచారం అందించింది.. మధ్యప్రదేశ్ తికమార్ఘ్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయిన వీరేంద్రకుమార్.. మొత్తం ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. వీరేంద్ర కుమార్ చేత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నెల17 నుంచి పార్లమెంట్ సమావేశాలు కానున్నాయి. ప్రధాని సహా ఎన్నికైన ఎంపిలచేత వీరేంద్ర కుమార్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
ఎంపీల ప్రమాణస్వీకారం అనంతరం ఈ నెల 19న జరిగే స్పీకర్ ఎన్నిక ప్రక్రియను కూడా ప్రొటెం స్పీకరే నిర్వహిస్తారు. ఆయన ప్రస్థానం చూస్తే.. మొదట ఏబీవీపీ కార్యకర్తగా వీరేంద్ర రాజకీయ ప్రస్థానం మొదలయింది. 1977-79 మధ్య కాలంలో ఏబీవీపీ కన్వినర్‌గా పని చేశారు. మోదీ మంత్రివర్గంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ, మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చైల్డ్ లేబర్ అంశంపై పీహెచ్‌డీ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com