11 Jun 2019 6:20 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / బీఎండబ్ల్యూ కారు...

బీఎండబ్ల్యూ కారు ఓనర్.. కోళ్లు, బాతులు దొంగతనం చేస్తూ..

బీఎండబ్ల్యూ కారు ఓనర్.. కోళ్లు, బాతులు దొంగతనం చేస్తూ..
X

ముచ్చటపడికారైతే కొన్నాడు కానీ దాంట్లోకి పెట్రోల్ కొట్టించడానికి డబ్బుల్లేవు. కారుని వాకిట్లో పెట్టుకుని ఖాళీగా కూర్చోలేకపోతున్నాడు. కారులో కూర్చుని చోరీలు చేస్తే అడిగేవాడు ఎవడనుకున్నాడు. చైనా సిచువాన్ ప్రాంతానికి చెందిన ఓ రైతు దాదాపు రూ.2 కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు కొన్నాడు. కారులో పెట్రోల్ కొట్టించడానిక్కూడా డబ్బుల్లేవు. ఉన్నదంతా ఊడ్చి కారు కొనేశాడు. పోని కారు కొనాలని కోరిక ఉంటే ఏదో స్థోమతకి తగ్గ కారు కొంటే సరిపోయేది. కానీ బీఎండబ్ల్యూనే కల్లోకి వస్తోందట. అందుకే ఆ కారుకే టెండరు పెట్టి.. దాచుకున్న సొమ్మంతా దానికే పెట్టేశాడు. కారెక్కి షికారు చేద్దామంటే పెట్రోల్ లేదు. జేబులో డబ్బులు ఖాళీ.

దీంతో మరో మార్గం లేక కోళ్లు, బాతులు దొంగతనం చేసి అవి అమ్మి సొమ్ము చేసుకుందామనుకున్నాడు. ఆ డబ్బుతో పెట్రోల్ కొట్టించుకుని హ్యాపీగానే తిరిగేస్తున్నాడు. ఈలోగా ఇంటి ముందు కప్పెట్టిన్న కోళ్లు, బాతులు మాయమవుతున్నాయంటూ స్థానికుల నుంచి పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమేరాల ఆధారంగా కోళ్లను దొంగతనం చేసే బీఎండబ్ల్యూ కారు ఓనర్‌ని పట్టుకోవడానికి పథకం వేశారు. విషయం తెలుసుకున్న కారు ఓనర్ పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. 120 స్పీడుతో పోలీసులకు చిక్కకుండా పారిపోవడానికి ప్రయత్నించాడు. అయినా పోలీసులు అతడి ఇంటి దగ్గర కాపు కాసి పట్టుకుని అరెస్టు చేశారు.

Next Story