జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వైస్ చైర్ పర్సన్లతో సీఎం కేసీఆర్ సమావేశం

జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వైస్ చైర్ పర్సన్లతో సీఎం కేసీఆర్ సమావేశం

గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్ లకు సీఎం ప్రత్యేక ప్రగతి నిధి నుంచి 10 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లతో ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్లగా, వైఎస్‌ చైర్మన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు అందరిని అభినందించారు. ఈ ఐదేళ్లలో కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. పదవి వచ్చిన తర్వాత సహత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తేను మంచి పేరు వస్తుందన్నారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి, ముల్కనూర్, అంకాపూర్ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలన్నారు కేసీఆర్‌. విజయాలు, అపజయాలు సర్వసాధారణం. రాజకీయాల్లో ఉన్నవారు ప్రజలతో నిత్యసంబంధాలు కలిగి ఉండడం ప్రాథమిక లక్షమన్నారు. గతంలో జడ్పీ చైర్మన్లకు పెద్దగా పనిలేదని... ఇక ముందు వారికే ఎక్కువ బాధ్యతలు ఉంటాయన్నారు.

పంచాయతీరాజ్ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్ ఉద్యమం, సహకారం ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వ వైభవం రావాలని చెప్పారు. పంచాయితీ కార్యదర్శుల మీద పూర్తి నియంత్రణతో పాటు...DPO, DLPO, EORD, MPDOలతో బాగా పనిచేయించాలన్నారు. దీనికి సంబంధించిన ఆర్ధిక, పరిపాలన, ఆజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తామని సీఎం చెప్పారు. ఆర్నెల్లలో పూర్తి మార్పు కనబడాలన్నారు.

Tags

Next Story