ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు : మంత్రి పెద్దిరెడ్డి

ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు : మంత్రి పెద్దిరెడ్డి

మైనింగ్‌ ద్వారా రాష్ట్రానికి 25శాతం ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తెలిపారు. మైనింగ్‌ ఆధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ కారణంగా రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. త్వరలోనే కొత్త ఇసుక పాలసీ తీసుకోస్తామన్నారు. దీని ద్వారా భారీగా ఆదాయం వస్తుందన్నారు. కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకు తవ్వకాలు, సరఫరా ఆపేయాలని మంత్రి ఆదేశించారు. ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరితో చర్చించిన తర్వాత సరైన ఇసుక విధానం అమల్లోకి తీసుకొస్తామన్నారు.

Tags

Next Story