జగన్‌ నివాసానికి చేరుకున్న రోజా

జగన్‌ నివాసానికి చేరుకున్న రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి జగన్‌ తో సమావేశమయ్యారు. సీఎంఓ నుంచి ఫోన్‌ రావడంతో ఆమె మంగళవారం సీఎం నివాసానికి చేరుకున్నారు. మంత్రిపదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రోజా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో జగన్‌ ఆమెను బుజ్జగించారు. మంత్రి పదవి ఎందుకివ్వలేదో ఆమెకు వివరించారు. మంత్రిపదవి వస్తుందని ఆమె భావించారు. కానీ సామాజికసమీకరణాల్లో అవకాశం ఇవ్వలేకపోయామని.. అయినా త్వరలోనే ప్రాధాన్యత ఇస్తామని జగన్‌ చెప్పినట్టు తెలుస్తోంది.

Tags

Next Story