మహిళల నుంచి డబ్బులు వసూలు చేసి..

మహిళల నుంచి డబ్బులు వసూలు చేసి..

మదర్‌ బేబి ఫౌండేషన్‌ పేరుతో మరో చీటింగ్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ సంస్థ ఒంగోలులో బ్రాంచి ఏర్పాటు చేసుకుని మహిళలను నిండా ముంచింది. ఇంటిరుణాలు, వ్యక్తిగత రుణాలు, కుట్టుమిషన్ల మంజూరు చేయిస్తామంటూ గ్రామాల్లోని మహిళల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. రుణాల వస్తాయన్న ఆశలో పెద్ద ఎత్తున మహిళలు డబ్బుకట్టారు.

ఎంతకీ తమకు రుణాలు రాకపోవడంతో అనుమానం వచ్చి నిర్వాహకులను మహిళలు నిలదీసారు. తమకేమి తెలియదని హైదరాబాద్‌లోని మెయిన్‌ బ్రాంచ్‌లో సంప్రదించాలని సంస్థ ఉద్యోగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.. చివరకు తాము మోసపోయామని తెలుసుకుని మహిళలు జిల్లా ఎస్పీ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ ఒంగోలు కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు.

మహిళల నుంచి వసూలు చేసిన డబ్బులు హైదరాబాద్‌లోని మెయిన్‌ బ్రాంచికి పంపించామని ఒంగోలులోని మదర్‌ బేబి ఫౌండేషన్‌ నిర్వాహకులు బుకాయిస్తున్నారు. వారు రుణాలు మంజూరు చేయించడంలో ఆలస్యం చేశారంటున్నారు. అసలు ఎవరు రుణాలు మంజూరు చేస్తారు.. బ్యాంకుల ద్వారా చేయిస్తారా.. లేక మదర్‌ బేబి ఫౌండేషన్‌ వారే రుణాలు ఇస్తారా.. అనేదానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. ఇందులో తమ తప్పుఏమి లేదు.. అంతా మెయిన్‌ బ్రాంచి నిర్వాహకులే చూసుకుంటున్నారని పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.

Tags

Next Story