అనారోగ్యం పాలైన ములాయం సింగ్.. పార్టీ శ్రేణుల్లో ఆందోళన..
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దాంతో ఆయ న్ను గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. లక్నో నుంచి చార్టెడ్ ఫ్లైట్‌లో ములాయంను గురు గ్రామ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ములాయం ఆస్పత్రిలో చేరడం గత 2 రోజుల్లో ఇది రెండో సారి. షుగర్ లెవల్స్ పెరిగిపోవడంతో ఆదివారం నాడు ములాయంను లక్నోలోని లోహియా ఆస్ప త్రిలో చేర్పించారు. చికిత్స తర్వాత ఆరోగ్యం కుదుటపడడంతో ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. గత రాత్రి మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో మేదాంత ఆస్పత్రిలో చేర్చి ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు.
ములాయం ఆరోగ్యం దెబ్బతినడంతో సమాజ్‌వాదీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలు కోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇక, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న ములాయం ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ములాయం సోదరుడు శివపా ల్ యాదవ్, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్‌లతో కూడా యోగి మాట్లాడారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com