క్రికెటర్‌తో అనుపమ ప్రేమాయణం..!!

క్రికెటర్‌తో అనుపమ ప్రేమాయణం..!!

సెలబ్రెటీలకు సంబంధించిన ఏ న్యూస్ అయినా పెద్ద సెన్సేషన్. అందునా సినిమా తారలకు క్రికెటర్లతో ప్రేమా పెళ్లి అంటే మరింత ఆసక్తి. తాజాగా నటి మాలీవుడ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్.. భారత ఫాస్ట్ బౌలర్ బూమ్రాతో ప్రేమలో మునిగి తేలుతోందని వార్త చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఒకరినొకరు ఫాలో అవుతుండడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఉన్నాయి. ఈ వార్తలు అనుపమ చెవిని చేరడంతో పెదవి విప్పక తప్పని పరిస్థితి. బూమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పుకొచ్చింది. అయినా ఎవ్వరికీ ఉపయోగం లేని ఇలాంటి వార్తలు పుట్టించడం వల్ల ఏమొస్తుంది అని కొంచెం ఘాటుగానే రియాక్ట్ అయ్యింది అనుపమ. గతంలో రాశి ఖన్నాతో బూమ్రా చెట్ట పట్టాల్ అన్న వార్తలు హల్ చల్ చేశాయి. రాశీ కూడా తూచ్.. మా ఇద్దరి మధ్య అలాంటిదేం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story