ఇప్పుడు వారి టార్గెట్ తెలంగాణ

తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ పూర్తి ఫోకస్ చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో జోష్ నింపుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీల రాజకీయంగా పూర్తిగా వెనుకబడ్డాయని.. ఆ గ్యాప్‌ను బీజేపీ మాత్రమే భర్తీ చేయగలదని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు.
తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి జోష్ మీదున్న బీజేపీ.. ఇప్పుడు ఇంకాస్త దూకుడు పెంచింది. ముఖ్యంగా కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిపదవి లభించడంతో.. కేడర్‌లో ఉత్సాహం ఇంకాస్త పెరిగింది. దీంతో పార్టీని ఇంకాస్త బలోపేతం చేసే దిశాగా ఆ పార్టీనేతలు కృషి చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో 2023లో అధికారంలో వచ్చేలా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందరూ కలిసి పనిచేస్తేనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఖాళీ అయిందని, ఆ గ్యాప్ ను మనమే భర్తీ చేయాలని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. GHMC ఎన్నికల్లోపు పార్టీ మరింతగా బలపడాలని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోకి అధికారంలోకి రావాలంటే GHMC ఎన్నికల్లో గెలవాలని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ అభివృద్ధిపై జరిగిన సమీక్షలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడటంలో జీహెచ్ఎంసీదే కీలక పాత్ర అన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకొస్తానని తెలిపారాయన. కేంద్ర మంత్రిగా అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ పర్యటిస్తున్న కిషన్ రెడ్డి వరసుగా ఆలయాలు దర్శించుకుంటున్నారు. అంబర్‌పేటలోని మహంకాళి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తరువాత అంబర్‌పేట నియోజకవర్గంలోని తులసిరామ్ నగర్, లంక బస్తీలలో మంత్రి కిషన్‌రెడ్డి పాద యాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా బస్తీ మహిళలు మంత్రి కిషన్‌రెడ్డికి మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

