అత్యాచారం చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే..

అత్యాచారం చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే..

గిరిజన మహిళే కదా వాడుకుని వదిలేద్దామనుకున్నాడు.. కానీ ఆమెనే పెళ్లి చేసుకోక తప్పలేదు ఆ ఎమ్మెల్యేకి. పేరుకి పెద్ద పోస్టు. కానీ బుద్ది మాత్రం చిన్నది. త్రిపుర రాష్ట్రానికి చెందిన రిమా వ్యాలీ ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనన్ జోయ్‌పై ఓ గిరిజన మహిళ ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. గత కొంత కాలంగా తనతో సన్నిహితంగా ఉంటున్న ఎమ్మెల్యే పెళ్లి చేసుకుందామనేసరికి మొహం చాటేస్తున్నాడని తెలిపింది. మహిళ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఐపీసీ 417,376 సెక్షన్ల కింద పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ప్రజాసంఘాలు గిరిజన మహిళకు అండగా నిలిచాయి. పరిస్థితి తీవ్ర రూపం దాల్చనుందని తెలుసుకున్న ఎమ్మెల్యే ఇరు కుటుంబాల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రేప్ కేసు పెట్టిన మహిళను ఆదివారం (జూన్9,2019) రోజున వివాహం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story