ఏపీ 15వ శాసనసభ సమావేశాలు.. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం..
ఏపీ 15వ శాసనసభ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన అప్పలనాయుడు వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత మొదట ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సభ్యుడిగా ప్రమాణం చేశారు.. అనంతరం అక్షర క్రమంలో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.. సీఎం సహా సభ్యులంతా దైవసాక్షిగా ప్రమాణం చేశారు.. వీరందరితో ప్రొటెం స్పీకర్ చిన అప్పల నాయుడు ప్రమాణం చేయించారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు జాతీయ గీతాలాపనతో మొదలయ్యాయి.. మొదట ప్రొటెం స్పీకర్ చిన అప్పలనాయుడు సభ విధి విధానాలను సభ్యులకు వివరించారు. ఆ తర్వాత సభ్యులు ప్రమాణం రాజ్యాంగబద్ధంగా సాగింది.
గురువారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.. సీనియర్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా సభ్యులంతా ఎన్నుకోనున్నారు. ఈ కార్యక్రమం అంతా ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన జరుగుతుంది. 14న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. జూన్ 15,16 తేదీలు శని, ఆదివారాలు అసెంబ్లీకి సెలవు. తిరిగి సోమవారం అసెంబ్లీ సమావేశమవుతుంది. సోమ, మంగళవారాల్లో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంతోపాటు..వివిధ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com