సీఎం జగన్‌తో ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం

సీఎం జగన్‌తో ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం

ఏపీలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తానని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు వెనక్కు తగ్గాయి. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం జగన్ హామీతో సమ్మె వాయిదా వేసినట్టు కార్మిక నాయకులు చెప్పారు. మూడు నెలల్లో విలీన ప్రక్రియ మొదలవుతుందని ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలిపారు. అదే జరిగితే ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అన్ని ప్రయోజనాలూ తమకూ వర్తిస్తాయని వాళ్లు సంతోషం వ్యక్తంచేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో సీఎం జగన్ చర్చలు ఫలించాయి.

Next Story