'అమ్మఒడి' పథకం ఎవరికి? నెటిజన్స్ కామెంట్స్..

మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు. అలా పంపిస్తే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారవుతారు. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి రూ.15000 ఇస్తామని జగన్ తన మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. జనవరి 26 నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తారు. అయితే ఇప్పుడు అందరిలో నెలకొన్న సమస్య ఏమిటంటే ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకేనా లేక ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వారికి కూడా వర్తింపజేస్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో నెటిజన్లు ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఎక్కువ శాతం మంది ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తింపజేయాలని కోరుకుంటున్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమ్మ ఒడికి సంబంధించి తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఇది మంచి పథకమని మెచ్చుకుంటూనే నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com