అమరావతిలోని మెగా ఇంజినీరింగ్ సైట్‌లో భారీ అగ్నిప్రమాదం
రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు చేస్తున్న మెగా ఇంజినీరింగ్ సైట్‌లో.. భారీ అగ్నిప్రమాదం జరిగింది. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద ఉన్న మెగా ఇంజినీరింగ్ సైట్‌లో.. రాత్రి పదకొండుంపావు సమయంలో ప్లాస్టిక్ పైప్‌లను ఉంచిన స్థలంలో మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడున్న వారు అప్రమత్తమయ్యేలోపే బలమైన గాలులకు మంటలు దట్టంగా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చి ఎట్టకేలకు మంటల్ని ఆర్పేశారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడడంతో.. మెగా కంపెనీకి సంబధించిన మెటీరియల్ అంతా సైట్‌కు తరలించారు. అక్కడే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి పక్కనే కార్మికుల నివాస సముదాయాలు కూడా ఉండడంతో.. మంటలు అటుగా వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. చివరికి ఫైర్ సిబ్బంది వాటిని ఆర్పేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com