ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంలో కీలక నియామకాలు

ఏపీ ప్రభుత్వంలో కీలక నియామకాలు
X

ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ... క్రమంగా అన్ని పదవులను భర్తీ చేస్తూ పాలనలో వేగం పెంచుతోంది. పార్టీ విప్‌లుగా కొత్తగా మరో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లకు ప్రభుత్వ విప్‌లుగా అవకాశం కల్పించారు. అంతకు ముందుచీఫ్‌ విప్‌గా శ్రీకాంత్‌రెడ్డి... ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, శ్రీనివాసులు విప్‌లుగా నియమితలయ్యారు. కొలుసు పార్థసారథి తనకు విప్‌ పదవి వద్దనడంతో... ఆయన్ని విప్‌ల జాబితా నుంచి తొలగించారు. ఇక అటు మంత్రి పదవి లభించని వైసీపీ ఫైర్‌ బ్రాండ్‌ నేత రోజాను... పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య- APIIC ఛైర్మన్‌గా నియమించారు.

మరోవైపు... తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ.. తుడా ఛైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న చెవిరెడ్డికి కేబినెట్‌ పోస్టు వస్తుందని మొదట అందరూ ఊహించారు. అయితే జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో.. ఆయనకు తుడా ఛైర్మన్‌ పోస్టు గ్యారంటీ అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అన్నట్లుగానే ప్రభుత్వం చెవిరెడ్డికి అదే పోస్టు కట్టబెట్టింది.

Next Story

RELATED STORIES