ఈ నెల 15 వ తేదీన ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 15 వ తేదీన ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. వన్‌ జనపథ్‌లో ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ భేటీలో.. వైసీపీకి చెందిన 22 మంది లోక్‌సభ సభ్యులు... ఇద్దరు రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర నిధుల సాధన వంటి అంశాలపై పార్లమెంటు ఉభయసభల్లో డిమాండ్‌ చేసేందుకు వైసీపీ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేసింది. దీనిపై అధినేత జగన్‌... ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్లమెంట్‌ ప్రసంగాల్లో ఏయే అంశాలు ప్రస్తావించాలి.. వేటిపై ఎలా మాట్లాడాలన్నది జగన్‌ వివరించనున్నారు.

Tags

Next Story