స్వామీజీ.. నా పేరెందుకు.. సింగర్ సునీత
వివాదాలకు దూరంగా ఉంటూ తనపనేదో తాను చేసుకుంటుంది సింగర్ సునీత. అందంతో పాటు, మృదు మధురమైన గాత్రం ఆమె సొంతం. తెలుగు సినిమాల్లో కొన్ని వేల పాటలు పాడిన సునీతకు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా మంచి పేరు ఉంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా స్మూత్‌గానే తిరస్కరిస్తుంది. ఈ పాటల కోయిల ఒంటరి తల్లిగా ఇద్దరి పిల్లల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల శారదా పీఠాధిపతి స్వామీ సరూపానందేంద్ర సరస్వతి ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన దగ్గరకు అనేక మంది సెలబ్రిటీలు వస్తుంటారని.. అందులో చిరంజీవి, రజనీకాంత్, సింగర్ సునీత కూడా ఉన్నారన్నారు. ఈ వార్త సునీత వరకు చేరడంతో.. అసలు ఆ స్వామీజీ దగ్గరకు తానెప్పుడూ వెళ్లలేదని.. అయినా ఆయనెలా తనపేరు చెప్పారని వాపోతోంది. కాంట్రావర్సీలకు దూరంగా ఉండే సునీత తనను బాధపెట్టే అంశాలపై
స్పందిస్తుందే తప్ప ప్రతి వాటికీ రియాక్ట్ కాదని సన్నిహితులు చెబుతుంటారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com