మూడేళ్ల చిన్నారి.. తండ్రి చేతిలో..

మూడేళ్ల చిన్నారి.. తండ్రి చేతిలో..

నాన్న నడిపే ట్రాక్టర్ కింద పడి మూడేళ్ల చిన్నారి జీవితం ముగిసిపోయింది. కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన జక్కు ప్రసాద్‌కి భార్య, మూడేళ్ల కూతురు ఉన్నారు. ముద్దు ముద్దు మాటలు పలికే మూడేళ్ల చిన్నారికి అమ్మ అన్నం తినిపిస్తోంది. మధ్యలో అమ్మ లోపలికి వెళ్లింది. ఆడుకుంటున్న చిన్నారి నాన్న ట్రాక్టర్ తీసుకుని పొలానికి వెళుతున్నాడని బయటకు వచ్చింది బై చెప్పడానికి. అంతలోనే ట్రాక్టర్ ఆ చిన్నారి మీదకు ఎక్కింది. వెంటనే అరుస్తూ పడిపోయింది రితిక.. అరుపులను విన్న నాన్న కిందికి దిగి చూసేసరికి.. రితిక క్రింద పడి పోయి అపస్మార స్థితిలో పడి ఉంది. వెంటనే బిడ్డని తీసుకుని ఆసుపత్రికి పరిగెట్టారు తల్లిదండ్రులు. అయినా ఉపయోగం లేదు. అప్పటికే రితిక ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story