అప్పుడు 'ఆమె'ను ఇబ్బంది పెట్టాను.. ఇప్పుడు బాధ పడుతున్నాను: అజిత్

అప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టాను.. ఇప్పుడు బాధ పడుతున్నాను: అజిత్

సినిమాకు కథ చాలా ముఖ్యం. ఆ కథను నడిపించే హీరో హీరోయిన్లు దానికి ప్రాణం పోస్తారు. అలాంటి కథలకు ప్రేక్షకులు పట్టం కడతారు. అందులో నటించిన నటీనటులను దేవుళ్లుగా ఆరాధిస్తారు. చాలా వరకు సినిమా స్టోరీలన్నీ హీరోలకే పెద్ద పీట వేస్తుంటాయి. హీరోయిన్లను వేధించడమో, ఆమెను ఒక గ్లామర్ గళ్‌గా చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తుంటాయి. కథలో భాగంగా హీరో ఆమెని కించపరిచే మాటలు మాట్లాడుతుంటాడు. నేను కూడా నా కెరియర్ తొలినాళ్లలో ఇలాంటి పాత్రలే చేశాను. మహిళలను ఇబ్బంది పెట్టే తరహా పాత్రలు చేశాను. ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. అలాంటి పాత్రలు చేసినందుకు ఇప్పుడు చాలా బాధపడుతున్నాను.

చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది అని అంటున్నాడు తమిళ్ హీరో అజిత్. వరుస సినిమాలతో, వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ ప్రస్తుతం హిందీలో హిట్టైన 'పింక్' సినిమాని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. నెర్కొండ పార్వై అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రంలో మహిళను గౌరవించే ఆదర్శవంతమైన పాత్రలో నటించినట్లు అజిత్ చెప్పుకొచ్చారు. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

Tags

Read MoreRead Less
Next Story