24 ఏళ్ళ క్రితం అఖిల్‌కి తల్లిగా నటించిన..

24 ఏళ్ళ క్రితం అఖిల్‌కి తల్లిగా  నటించిన..

హీరోగా అక్కినేని అఖిల్ ఎంట్రీ అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇప్పటివరకు అఖిల్‌ నటించిన చిత్రాలు అఖిల్‌, హలో, మిస్టర్ మజ్ను బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ సినిమాలు అభిమానులను మెప్పించలేకపోయాయి. దీంతో అఖిల్ తన నాలుగో చిత్రం గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మిస్టర్ మజ్ను తర్వాత నాలుగు సినిమా నిర్ణయంపై చాలా గ్యాప్ తీసుకున్నాడు. చివరకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాలుగో చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బేనర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సినిమాలో అఖిల్‌కి తల్లిగా ప్రముఖ నటి ఆమని నటిస్తుందట. ఈ మూవీలో తల్లి పాత్ర చాలా కీలకం కానున్న నేపథ్యంలో ఆ పాత్రకు ఆమనిని దర్శకుడు ఎంపిక చేశాడట. 24 ఏళ్ళ క్రితం వచ్చిన సిసింద్రీ చిత్రంలో అఖిల్‌కి తల్లిగా ఆమని నటించారు. ఈ సినిమాలో మరోసారి ఆమని.. అఖిల్‌కు తల్లిగా నటించనుంది. సిసింద్రీ సినిమా మంచి హిట్ కావడంతో అఖిల్ నాలుగో చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story