దాసరి కుమారుడు అదృశ్యం

దాసరి కుమారుడు అదృశ్యం
X

కేంద్ర మాజీ మంత్రి దివంగత దాసరి నారాయణ కుమారుడు తారక మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. ఈ నెల 9 నుంచి ఆయన కనిపించటం లేదు. దీంతో అతని కుటుంబసభ్యులు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే..2008లో కూడా ప్రభు కొద్ది రోజులు ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చాక భార్య సుశీలే తనను కిడ్నాప్ చేసిందని ఆరోపించాడు. దాసరి మృతి తర్వాత ఆయన కుటుంబంలో ఆస్తి తగాదాలు తీవ్రం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభు కనిపించకుండా పోవటంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే..చిత్తూరులో ఉన్న మొదటి భార్య దగ్గరికి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Next Story