అధికారపక్ష సభ్యులకు కౌంటర్లు విసిరిన చంద్రబాబు

అధికారపక్ష సభ్యులకు కౌంటర్లు విసిరిన చంద్రబాబు

స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారామ్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మైకుల గురించి ఆసక్తికర సంభాషణ జరిగింది.. మైకులు సరిగా పనిచేయడం లేదని చంద్రబాబు అన్నారు.. మైక్‌ మైక్‌ అంటూ చంద్రబాబు మాట్లాడుతుండగా అధికార పక్షం సభ్యులంతా ప్రతిపక్ష నేత వాయిస్‌ తగ్గిందంటూ చంద్రబాబుపై చలోక్తులు విసిరారు.. అదే సమయంలో వాయిస్‌ మరింత పెంచిన చంద్రబాబు అధికారపక్ష సభ్యులకు కౌంటర్లు విసిరారు.. మాటలొస్తాయని, మాటలకేం బాధలేదని అన్నారు.. సుదీర్ఘ అనుభవం ఉందని, రాజకీయాల్లో అన్నీ చూశామని చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో అధికార పక్ష సభ్యులు సెటైర్లు వేయడంతో సభ మొత్తం నవ్వులు విరిశాయి.. ఆ వెంటనే చంద్రబాబు మళ్లీ కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు.. మాటలు ఆటోమేటిక్‌గా వస్తాయని, మాటలు తగ్గవని, ఏం బాధలేదని అన్నారు.. మళ్లీ అధికార పక్ష సభ్యులు ఏదో అంటుండగా చంద్రబాబు కల్పించుకుని మా ఆధ్వర్యంలో మైకులు బాగానే పనిచేశాయని, మీ ఆధ్వర్యంలోనే ఇప్పుడు మైకులు ప్రాబ్లమ్‌ వచ్చాయని అన్నారు.. మీరు ముందు వాల్యూమ్‌ పెంచాలని, ఆ తర్వాత మా వాయిస్‌ ఆటోమేటిక్‌గా పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఈ ఎపిసోడ్‌తో అసెంబ్లీలో కొంత ఆసక్తికర చర్చతోపాటు నవ్వులు విరబూశాయి.

Tags

Next Story