ట్యాబ్లెట్లలో గోల్డ్‌ పేస్ట్‌ అమర్చి రవాణా ..

ట్యాబ్లెట్లలో గోల్డ్‌ పేస్ట్‌ అమర్చి రవాణా ..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కేంద్రంగా గోల్డ్‌ స్మగ్లింగ్‌ ముఠాలు బరి తెగిస్తున్నాయి. పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా రవాణా చేస్తున్నాయి. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్‌ స్మగ్లింగ్‌ గుట్టు రట్టైంది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు.. అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. అందులో మూడు ట్యాబ్లెట్లు బయటపడ్డాయి. కానీ వాటి సైజు చూడగానే అనుమానం అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వాటిని క్షణ్ణంగా పరిశీలించగా.. బంగారాన్ని పేస్టులా తయారు చేసి కాప్సిల్స్‌లో అమర్చినట్లు గుర్తించారు.

ట్యాబ్లెట్లను కరిగిస్తే అవి కాస్తా తళతళ మెరిసే 24 క్యారెట్ల బంగారంగా మారడంతో కస్టమ్స్‌ అధికారులు షాక్‌ తిన్నారు. మొత్తం 538 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు..నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పట్టుబడిన బంగారం విలువ 17లక్షలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. బంగారం రవాణా వెనుక ఇంకెవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story