ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో కివీస్ టాప్ అయితే భారత్ ది మూడో స్థానం

ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో కివీస్ టాప్ అయితే భారత్ ది మూడో స్థానం

ప్రపంచకప్‌ను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షర్పాణమేతే... తాజాగా భారత్‌, న్యూజిలాండ్ పోరు కూడా వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్ గంట ముందు వరుణుడు శాంతించినా... టాస్ వేసే సమయానికి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. చాలాసేపు వర్షం తగ్గడం , మళ్ళీ రావడంతో అంపైర్లు పిచ్‌ను పరిశీలించడం కూడా పూర్తిగా కుదర్లేదు. సమయం గడిచేకొద్ది వర్షం పెరిగిపోవడంతో మ్యాచ్‌ను జరిగే అవకాశాలు కనిపించలేదు. దీంతో రద్దు నిర్ణయం తీసుకున్న అంపైర్లు ఇరు జట్లకూ చెరొక పాయింట్ ఇచ్చారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కివీస్ టాప్ ప్లేస్‌లో ఉంటే...భారత్ మూడో స్థానంలో నిలిచింది. టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం పాకిస్థాన్‌తో తలపడనుంది.

Tags

Read MoreRead Less
Next Story