ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాః సుమలత

ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాః సుమలత

మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచిన సుమలత తాజాగా ఆ ప్రాంతంలో పర్యటించారు. మాండ్యలో వారానికి మూడు రోజులు గడుపుతానని ఎంపీ సుమలత తెలిపారు. మాండ్య పర్యటనలో భాగంగా ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు."ఇప్పటికే తనకు మాండ్య లో నివాసం ఉందని జూలై నుంచి ప్రతి తాలూకాలో పర్యటిస్తానన్నారు. మాండ్య ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు. వారికి నిరంతరం రుణపడి ఉంటాను. వారంలో మూడురోజులు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను. బెంగళూరు, ఢిల్లీ ఎక్కడ ఉన్నా ప్రజాశేయస్సు కోసం పోరాడుతాను" అన్నారు

అలాగే సీఎం కుమారస్వామి చేస్తున్న 'పల్లె నిద్ర'పై స్పందించారు. ఆయన చేస్తున్న కార్యక్రమంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయనని ఆయనకు మంచి జరగాలన్నారు. ప్రతిక్షణం ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తూ వారు ఇచ్చిన బాధ్యతాయుతమైన పనులను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. మాండ్య లో కరువు సమస్యను పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఎవరిని తాను శతృవులుగా భావించడం లేదని ఎవరిపట్ల వ్యతిరేకంగా మాట్లాడేది లేదన్నారు.

Tags

Next Story