మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి పెద్ద పదవి ఇచ్చిన సీఎం
ఏపీలో ఐదు ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి ఛైర్మన్లను కూడా నియమించారు. కృష్ణా-గుంటూరు డెవలప్‌మెంట్ బోర్డుకు ఛైర్మన్ గా పార్ధసారధి, రాయలసీమ బోర్డు ఛైర్మన్ గా అనంత వెంకట్రామిరెడ్డిని నియమించారు. ప్రకాశం-నెల్లూరు జిల్లాల బోర్డుకు కాకాణి గోవర్దన్ రెడ్డి, ఉభయగోదావరి జిల్లాలకు ఛైర్మన్ గా దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ గా ధర్మాన ప్రసాదరావును నియమించారు. అటు సిఆర్‌డిఏ ఛైర్మన్‌గా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డిని నియమించారు.
మంత్రివర్గంలో చోటు లబించకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేతలను బుజ్జగింపుల్లో భాగంగానే వారికి ఈ పదవులు ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్ధసారధి, దాడిశెట్టి రాజాలకు విప్ పదవులు ఇచ్చినా వారు పదవులుతీసుకోవడానికి ఆసక్తిచూపలేదు. దీంతో వారికి ప్రాంతీయ బోర్డు ఛైర్మన్ పదవులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు సీనియర్లు అయిన ధర్మాన ప్రసాదరావు, కాకాణి కి కూడా పదవులు ఇచ్చారు. మంత్రి పదవి ఇస్తానని సామాజిక సమీకరణాల్లో ఇవ్వలేకపోయిని నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి కీలకమైన సీఆర్‌డిఏ ఛైర్మన్ పదవి అప్పగించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com