రైతు భరోసా పథకాన్ని కౌలురైతులకు కూడా వర్తింపజేస్తాం - మంత్రి కన్నబాబు
రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ నుంచి అమలు చేస్తామన్నారు మంత్రి కురసాల కన్నబాబు. సీఎం జగన్ ఇచ్చిన మాటను ముందుగానే అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేవారు. రైతులు, మహిళల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా పథకాన్ని కౌలురైతులకు కూడా వర్తింపజేస్తామన్నారు. సుమారు 15 లక్షల మంది కౌలు రైతులకు.. 12500 రూపాయలు అందజేస్తామన్నారు కన్నబాబు.
రైతుల సంక్షేమం కోసం ఎంతో చేసినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఫీల్ అవుతున్నారని విమర్శించారు మంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు ఇంకా ఓటమి నుంచి బయటకు రాలేదన్నారు. రుణమాఫీ చేస్తామన్నారు. హడావుడిగా అన్నదాత సుఖీభవ పథకం తీసుకొచ్చారన్నారు. పసుపు కుంకుమ పథకంతో ఎన్నికల్లో గెలవాలనుకున్నారని విమర్శించారు. రైతు సంక్షేమం గురించి ఒకరి చేత చెప్పించుకోవాల్సిన స్థితిలో తమ ప్రభుత్వం లేదన్నారాయన.
రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు మంత్రి అనిల్‌కుమార్ యాదవ్. అవినీతి బయటపడుతుందనే భయం చంద్రబాబులో ఉందన్నారాయన. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని...ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తుందన్నారు. అవినీత రహిత పాలన అందించాలన్నదే జగన్ లక్ష్యమన్నారు మంత్రి అవంతీ శ్రీనివాస్. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారాయన. ప్రతి పథకంలోనూ పారదర్శకత పాటిస్తామన్నారు. ప్రజా సంక్షేమం పథకాల విషయంలో నిక్కచ్చిగా ఉంటామంటున్నారు మంత్రులు. ప్రతి పథకం అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com