మరో ప్రపంచ రికార్డుకు చేరువలో కోహ్లీ

ఈ వరల్డ్ కప్‌లో భారత్‌ను విజయాల బాట పట్టిస్తున్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంకా 57 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 11వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు. ఇప్పటికే అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన కోహ్లీ ఈ రికార్డును ఈ రోజు న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 221 ఇన్నింగ్స్‌ల్లో 10943 పరుగులతో కొనసాగుతున్నాడు.
కోహ్లీ 11వేల పరుగులు పూర్తి చేస్తే.. భారత్ తరఫున ఇన్ని పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మన్ అవుతాడు. ప్రపంచ క్రికెట్‌లో తొమ్మిదవ క్రికెటర్‌గా రికార్డు సాధిస్తాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు గంగూలీ, సచిన్ మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు. ఇక, మరో సెంచరీ చేస్తే న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా సెహ్వాగ్, పాంటింగ్ సరసన చేరతాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com