శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్న యువతి మిస్సింగ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్న యువతి మిస్సింగ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యం మిస్టరీగా మారింది. ఇంటి నుంచి బయటకు వెళ్లి వారం రోజులైనా ఆచూకి తెలియలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన 28 ఏళ్ల రాజ్యలక్ష్మి రెండేళ్లుగా విమానాశ్రయంలో తాత్కాలిక ఉద్యోగం చేస్తోంది. అవివాహితైన రాజ్యలక్ష్మి RB నగర్‌కాలనీలో అద్దెగదిలో నివసిస్తోంది. ఈ నెల 7న ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె ఇప్పటి వరకు ఆచూకీలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శంషాబాద్ పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story