నమ్మలేకపోతున్నాను.. కలా.. నిజమా.. : రష్మిక మందన

నమ్మలేకపోతున్నాను.. కలా.. నిజమా.. : రష్మిక మందన

ఒక్కసారి కాదు.. ప్రతి సారీ అదృష్టం రష్మిక తలుపు తడుతూనే ఉంది. చిన్నప్పుడు సిటీలో చదువుకోవాలని కలలు కనేది. అదేంటో అనుకున్న వెంటనే అలాజరిగిపోయింది. బెంగళూరులో చదువుకుంది. అనుకోకుండానే సినిమాల్లో అవకాశం వచ్చింది. కన్నడ బ్యూటీ అయినా తెలుగు వారు కూడా బాగానే ఆదరించారు. రష్మిక తన అందంతో పాటు.. అభినయాన్ని ప్రదర్శిస్తూ తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. వరుసగా అవకాశాలు. అన్నీ సూపర్ డూపర్ హిట్టులు. ఇప్పుడు మరింత సర్‌ప్రైజ్ ఇచ్చే విషయం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కథానాయికగా ఎంపిక కావడం. అనుకోకుండా వస్తున్న అవకాశాలు.. స్టార్ నాయికగా గుర్తింపు.. వావ్.. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నా జీవితమేనా లేక వేరొకరి జీవితంలోకి నేనొచ్చానా అని డౌట్ వస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సినిమా జీవితంలో ఓ భాగం అనుకునేదాన్ని.. ఇప్పుడు మాత్రం సినిమానే జీవితం అనిపిస్తోంది అని చెబుతోంది రష్మిక. డియర్ కామ్రెడ్ అంటూ విజయ్ దేవరకొండతో జతకట్టిన సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నితిన్‌కి జోడీగా మరో చిత్రం, మహేష్‌తో మరో ప్రాజెక్టు.. మొత్తానికి రష్మిక డైరీ పుల్.. ఆమె డేట్స్‌కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి దర్శక నిర్మాతలది.

Tags

Read MoreRead Less
Next Story