విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు.. టీడీపీ వర్గాల్లో కలకలం..

విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు.. టీడీపీ వర్గాల్లో కలకలం..

గన్నవరం విమానాశ్రయంలో మాజీ సీఎం చంద్రబాబును భద్రతా సిబ్బంది తనిఖీ చేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును తనిఖీ చేశారు. చంద్రబాబు వాహనాన్ని విమానాశ్రయంలోకి అనుమతించలేదు. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ నుంచి విమానం వరకు ప్రయాణికుల బస్‌లోనే చంద్రబాబు ప్రయాణించారు. వీఐపీ, జెడ్‌ ప్లస్ భద్రతలో ఉన్నా.. చంద్రబాబుకు ప్రత్యేక వాహనాన్ని అధికారులు కేటాయించలేదు. ఏపీలోనూ చంద్రబాబు కాన్వాయ్‌కి పైలెట్‌ క్లియరెన్స్‌ను‌ తొలగించారు. ఐతే.. ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రతకు ముప్పని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Tags

Next Story