సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త?

సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త?

సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబో తున్నట్లు సమాచారం. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌‌లో గృహ బీమాపై పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంటి బీమా పన్నులో పూర్తి ఉపశమనం లేదా రాయితీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. హౌసింగ్ ఇన్సూరెన్స్ తీసుకున్న కస్టమర్లకు ఆదాయపు పన్నులోనూ ఊరట కల్పించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

జూన్ 17 నుంచి 17వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 26 వరకు పార్లమెంట్ సమావే శాలు కొనసాగనున్నాయి. జూలే 5న దేశ వార్షిక బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ లోక్‌సభకు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో బీమా కంపెనీలు ఓ సూచన చేసినట్లు సమాచారం. గృహ బీమా పన్నులో రాయితీ లేదా పూర్తి ఉపశమనం ప్రకటించాలని ఇన్సూరెన్స్ కంపెనీలు కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై ఆర్థికవర్గాలు సానుకూలంగా స్పందించాయని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story