సీఎం జగన్ ఇచ్చిన హామీలో తొలి అడుగు

ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలో తొలి అడుగు పడింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటయ్యింది. ఇందులో సభ్యులుగా ఆర్‌ అండ్‌ బి ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్థిక కార్యదర్శి, ఆర్టీసీ ఈడీ, రిటైర్డ్‌ ఇంజినీర్‌ సుదర్శనం ఉన్నారు. ఆర్టీసీ విలీనం, ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టడం.. ఆర్టీసీ కార్మికుల ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేసి.. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Tags

Next Story