ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి కన్ఫ్యూజన్‌

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి కన్ఫ్యూజన్‌

ఏపీకి ప్రత్యేక హోదాపై కన్ఫ్యూజన్‌ కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదాపై ఒకే వేదికపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు తలో మాట మాట్లాడారు. ప్రత్యేక హోదాను మించి ప్యాకేజీ ఇస్తామని మరోసారి ప్రకటించారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో కలిసి పని చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఏపీకి ఏం అవసరమో అవన్నీ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్న పీయూష్‌ గోయల్‌... గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా రాజకీయం చేసిందని ఆరోపించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.

మరోవైపు అదే వేదికపై ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి భిన్నంగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. స్పెషల్ స్టేటస్ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు గౌతంరెడ్డి.

Tags

Next Story