కామ పూజారి వికృత చేష్ట.. వివాహితను..

కామ పూజారి వికృత చేష్ట.. వివాహితను..

ఓ కామ పూజారి వికృత చేష్టకు దంపతులు బలైపోయారు. నిండు నూరేళ్లు బతకాల్సిన ఆ జంటగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకాలో చోటుచేసుకుంది. సాదరహళ్లి గ్రామంలో నివసిస్తున్న లోకేశ్‌, కౌసల్య దంపతులు సంసారంలో అదే గ్రామంలో మారమ్మ దేవాలయం పూజారి పనిచేస్తున్న త్యాగరాజ్‌మ్ చిచ్చు రేపాడు. కౌసల్యను మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమెను బెంగళూరు తీసికెళ్లి కొన్ని రోజులపాటు సహజీవనం చేశాడు. చివరకు కౌసల్య తన తప్పు తెలుసుకుని తిరిగి భర్త దగ్గరకు వచ్చేసింది.

ఈ క్రమంలో కౌసల్య తనని విడిచి వెళ్ళిపోవడంతో ఆగ్రహించిన పూజారి త్యాగరాజ్‌ ఆమెతో గతంలో సన్నిహితంగా తీసుకున్న ఫోటోలోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ విషయం ఊరు మెుత్తం తెలిసిపోవడంతో ఆ దంపతులను గ్రామస్థులు అసహించుకోవడం మెుదలుపెట్టారు. ఈ అవమానం భరించలేని లోకేశ్, కౌసల్య ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్య విషయం తెలుసుకున్న పూజారి గ్రామం నుంచి పరారయ్యాడు. దంపతుల అత్మహత్యతో అగ్రహోదగ్రులైన బంధువులు, గ్రామస్తులు పూజారి ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో అతడి కారుతో పాటు దేవాలయం వద్ద నిలిపి ఉన్న మరో కారు, నాలుగు బైక్‌లు, ఒక ఆటో, నాలుగు సైకిళ్లు దగ్ధమయ్యాయి. దీంతో పోలీసు బలగాలు ఆ గ్రామంలో మోహరించాయి. పోలీసు బందోబస్తు మధ్యనే దంపతులకు అంత్యక్రియలు నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story