డెలివరీ బాయ్‌ అనుకుని డోర్‌ తెరిచాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు

డెలివరీ బాయ్‌ అనుకుని డోర్‌ తెరిచాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్తను దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హతమార్చారు. . అమిత్‌ కొచ్చార్‌ అనే వ్యాపారవేత్త ఢిల్లీలోని వికాస్‌పురిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం తన స్నేహితులు ఇంటికి రావడంతో వారి కోసం ఆన్‌లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు కొచ్చార్‌. కొంత సమయం తర్వాత ఇంటి కాలింగ్ బెల్ మోగడంతో డెలివరీ బాయ్ వచ్చాడనుకొని ఇంటి డోర్ తెరిచాడు అమిత్‌ . అతను డోర్‌ తీయగానే కొందరు దుండగులు అమిత్‌ను లాక్కెళ్లి కారులో పడేశారు. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. తర్వాత అక్కడినుంచి పరారయ్యారు

కాల్పుల శబ్ధం విన్న స్నేహితులు బయటకు వెళ్ళి చూడగా కొచ్చార్‌ రక్త మడుగులో కనిపించాడు. దీంతో అతన్ని వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే కొచ్చార్‌ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని కేసు నమోదు చేసున్నారు. నిందుతుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story