మరో మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్న ఇస్రో

మరో మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్న ఇస్రో

వరుస విజయాలతో సత్తా చాటుతున్న ఇస్రో...మరో మెగా ప్రాజెక్టుకు సిద్ధమైంది. మనదేశానికి సొంతంగా ఓ స్పేస్ స్టేషన్‌ను ఉండాలని భావిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఆదిశగా అడుగులు వేస్తోంది. మైక్రో గ్రావిటీ పరిశోధనల కోసం, చిన్న మాడ్యూల్‌గా సొంత స్పేష్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్నది ఇస్రో ఆలోచన. 2030 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.

అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రోకు ఇప్పుడు తిరుగులేదు. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఇస్రో.. వచ్చే నెలలో చంద్రయాన్-2 ప్రయోగాన్ని నిర్వహించనుంది. మరో మూడేళ్లలో జాబిలిపైకి మానవున్ని పంపాలని టార్గెట్‌గా పెట్టుకుంది. 2022లో మానవసహిత గగన్‌యాన్ ప్రాజెక్టును కంప్లీట్ చేయాలని ఫిక్సై పోయింది. ఆ టార్గెట్‌ కంప్లీట్ చేసిన తర్వాత స్పేస్ స్టేషన్ నిర్మాణంపై ఇస్రో దృష్టి సారించనుంది.

సొంత స్పేస్ స్టేషన్ ప్రాజెక్టుకు రూపురేఖలు ఇవ్వడానికే దాదాపు 5 నుంచి 7 ఏళ్లు పట్టే అవకాశముంది. అంతే కాదు పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతోనే స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించబోతున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్టుకు ఖర్చు కూడా భారీగానే ఉండనుంది. ప్రస్తుతానికి అంతరిక్ష కేంద్ర నిర్మాణం ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు మాత్రమే జరుగుతున్నాయి. 2022లో జరిగే గగన్‌యాన్‌ మిషన్‌కు కొనసాగింపుగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు ప్రాజెక్టు చేపట్టనున్నారు ఇస్రో సైంటిస్టులు. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యాలు మాత్రమే అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్‌ కలిగి ఉన్నాయి. ఈ స్పేస్‌ స్టేషన్‌ను మూడు దేశాలూ సంయుక్తంగా నిర్మించాయి. ఈ నేపథ్యంలో మనకు ఒక స్పేస్‌ స్టేషన్‌ ఉండాలని భావిస్తోంది ఇస్రో.

అసలు స్పేస్‌ స్టేషన్‌ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే ఉపయోగాలేంటి? భూమికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో కొన్ని రోజులపాటు వ్యోమగాములు ఉండేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాన్నే అంతరిక్ష కేంద్రంగా పిలుస్తారు. దీనిని భూస్థిర కక్ష్యలో తిరుగుతూ ఉండే ఓ భారీ ఉపగ్రహంగానూ అనొచ్చు. అగ్రరాజ్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎస్‌ఎస్‌ను 1998 నుంచి దశలవారీగా విస్తరిస్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌ బరువు దాదాపు 420 టన్నులకు చేరుకుంది. 2000లో తొలిసారిగా ఈస్పేస్‌ స్టేసన్‌లో ఓ వ్యోమగామి అడుగుపెట్టారు. ఇక 2011లో ఐఎస్‌ఎస్‌కు చివరి మాడ్యూల్‌ను జోడించారు. ఇప్పుడు దీనికి ధీటుగా మరో స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసి అంతరిక్ష పరిశోధనల్లో తన సత్తా చాటాలని భావిస్తోంది భారత్‌.

Tags

Read MoreRead Less
Next Story