నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం.. ఇప్పుడు అందరి దృష్టి ఆ మ్యాచ్‌పైనే..

ఇంగ్లండ్‌ వేదికగా గురువారం జరగాల్సిన టీమిండియా - న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఉదయం ట్రెంట్ బ్రిడ్జ్‌ మైదానాన్ని వరుణుడు వదలకపోవడంతో మ్యాచ్‌ రద్దుకాక తప్పలేదు. మధ్యాహ్నం కొంతసేపు వర్షం గ్యాప్‌ ఇవ్వడంతో.. మ్యాచ్‌పై అందరికీ ఆశలు చిగురించాయి. కానీ వర్షం మళ్లీ ప్రారంభం కావడంతో... మ్యాచ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు గ్రౌండ్‌ను చెక్‌ చేసిన అంపైర్లు, మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్‌ రద్దు కావడంతో భారత్‌, న్యూజిలాండ్‌కు మరో పాయింట్‌ వెనక్కి తగ్గింది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు వర్షార్పణం కాగా.. తాజాగా నాలుగో మ్యాచ్‌ కూడా వర్షం వల్ల రద్దైంయింది. ఈ టోర్నిలో మొత్తం 4 మ్యాచ్‌లు రద్దయ్యాయి.

ప్రపంచకప్‌లో భారత్ అజేయంగా దూసుకుపోతోంది. ఇప్పటికే భారత్‌ ఆడిన రెండు మ్యాచ్‌లోనూ గెలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మీద గెలిచిన భారత్‌.. న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. మ్యాచ్‌ రద్దు కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఆదివారం జరిగే పాక్‌ - భారత్‌ మ్యాచ్‌పైనే ఉంది. ఎల్లుండి దాయాది పాకిస్థాన్‌తో భారత్‌ తలపడనుంది. మాంచెస్టర్‌లో ఈ మ్యాచ్‌ జరగనుంది.

పాయింట్ల ప్రకారం చూసుకుంటే న్యూజిలాండ్‌ 7 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉంది. 6 పాయింట్లతో ఆస్ట్రేలియా, రెండో ప్లేస్‌లో ఉండగా... 5 పాయింట్లతో భారత్‌ మూడో ప్లేస్లో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story