బీజేపీ వైపు చూస్తున్న ఆ ఎమ్మెల్యేలు
కర్నాటకలో ఎట్టకేలకు మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు శంకర్, నగేష్‌లతో గవర్నర్ వజుభాయ్ వాలా ప్రమాణం చేయించారు. కర్నాటక రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర పాల్గొన్నారు.
గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కమలతో సంకీర్ణంలో అలజడి మొదలైంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు. దీంతో అప్రమత్తమైన జేడీఎస్-కాంగ్రెస్ కూటమి..ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు మంత్రి వర్గాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను సంతృప్తి పరిచేలా వారిని మంత్రివర్గంలోకి తీసుకుంది.
ఈ నెల 12నే కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది. అయితే ప్రముఖ నటుడు, రచయిత గీరీష్ కర్నాడ్ మృతితో.. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ఇవాళ్టికి వాయిదా పడింది. మరీ ఇప్పటికైనా ప్రభుత్వంలో అంతర్గత పోరు సమసిపోతుందా? సీనియర్లు అలక వీడుతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com