‘లిటిల్‌ టైగర్‌.. భార్గవ్‌రామ్‌కు అప్పుడే ఏడాది..

‘లిటిల్‌ టైగర్‌.. భార్గవ్‌రామ్‌కు అప్పుడే ఏడాది..

టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్‌ రెండో కుమారుడు భార్గవ్‌ రామ్‌ శుక్రవారం తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా క్యూట్‌గా ఉన్న భార్గవ్‌ ఫోటోలను తారక్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఉయ్యాల పైన ఉన్న భార్గవ్‌ను ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న ఫొటోతో పాటు, అలాగే పెద్ద కుమారుడు అభయ్‌‌తో భార్గవ్‌ కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఫోటోలతో పాటు ‘భార్గవ్‌ తొలి పుట్టినరోజు’ అని క్యాప్షన్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. తారక్ పోస్ట్‌ చేసిన నిమిషాల్లోనే 40 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ‘లిటిల్‌ టైగర్‌’ భార్గవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ విషెస్ తెలియజేస్తున్నారు ఫ్యాన్స్.

ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ 2014 జులై 22 లో జన్మించాడు. ఆ తర్వాత గత ఏడాది ఎన్టీఆర్ దంపతులకు భార్గవ్ జన్మించాడు.. ఇద్దరు కొడుకులతో సరదాగా గడుపుతూ జూనియర్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. RRR సినిమా షూటింగ్‌లో చేతికి గాయం కావడం వల్ల కొన్నిరోజులు విరామం తీసుకున్న ఎన్టీఆర్‌.. తాజాగా ఆ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది మల్టీస్టారర్ మూవీ. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మెగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీంగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు.

View this post on Instagram

#Bhargav turns one!

A post shared by Jr NTR (@jrntr) on

Tags

Read MoreRead Less
Next Story