ఆ టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

ఆ టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన చంద్రబాబు

టీడీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు టీడీకీ కార్యకర్తలపై వంద దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో తమ పార్టీకి ఐదుగురు కార్యకర్తలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు.

తన రాజకీయ జీవితంలో గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు ఎప్పుడూ చేయలేదని అన్నారు చంద్రబాబు నాయుడు. ఓటమి నిజమైన కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలతో సమావేశం అవుతూ మనోధైర్యం నింపాలని..అదే సమయంలో పార్టీ పటిష్టత కోసం కార్యకర్తల నుంచి ఆలోచనలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

Tags

Next Story