టీడీపీలో హ్యూమన్ టచ్ పోయింది : జూపూడి ప్రభాకర్ రావు
టీడీపీ ఓటమికి కారణాలేంటి..? అధికారంలో వున్న ఐదేళ్లలో జరిగిందేంటి..? కార్యకర్తల వాయిస్ అధినేత వరకు ఎందుకు చేరలేదు..? గ్రామస్థాయిలో పరిస్థితి ఎందుకు రివర్స్ అయింది..? ఈ విషయాలన్నిటిపైనా, పార్టీ ఓటమికి కారణాలపైనా టీడీపీ నేతలు విశ్లేషించుకుంటున్నారు.. విజయవాడలో నిర్వహించిన టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశంలో నేతలు గళమెత్తారు.. ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పులను పార్టీ అధినేత ముందు ప్రస్తావించారు.. పార్టీ పెద్దలు చేసిన తప్పులను నేతలు, ప్రజాప్రతినిధులు ఎత్తి చూపారు.. వేలమందితో చంద్రబాబు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లను అశోక్‌గజపతి రాజు తప్పు పట్టారు.. వేల మందితో కాన్ఫరెన్స్‌ల వల్ల చెప్పింది వినడం మినహా వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందన్నారు..
అటు జూపూడి ప్రభాకర్ కూడా అధినేత ముందు తన వాయిస్ వినిపించారు. టీడీపీలో హ్యూమన్ టచ్ పోయిందన్నారు. కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు బాగా దూరం అయ్యారన్నారు. పార్టీ నిర్లక్ష్యానికి గురవుతున్న విషయం పెద్దలు గుర్తించలేదని జూపూడి అన్నారు. అయితే, ఇదే సమయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ నివేదికలు కూడా కొంప ముంచాయని ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు అధినేతకు చెప్పారు. గతంలో, ఇప్పుడు అధికారులను పక్కన పెట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
అటు పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి కూడా ఘాటుగానే మాట్లాడారు. కోడెల కుటుంబ అక్రమాలపై జనం ఎన్నికల సమయంలోనే ప్రస్తావించారని అన్నారు. అలాగే గ్రామస్థాయిలో అవినీతిపై అధినేతకు చెప్పే అవకాశం లేకుండా చేశారన్నారు. చంద్రబాబు చుట్టూ చేరిన బృందం ఆయనకు వాస్తవాలు తెలియకుండ చేశారంటూ ఘాటుగానే మాట్లాడారు. విభేదాలు విడిచిపెట్టి ముందుకు సాగుదామని వర్క్‌షాప్‌లో అనంతపురం జిల్లా నేతలు చెప్పారు.. ఇప్పుడు కలిసి లేకుంటే మరింత నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఇక పార్టీలో లీగల్ వింగ్ పటిష్ట పరచాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అధినేత చంద్రబాబుకు చెప్పారు. వైసీపీ తమపై పెడుతున్న కేసులను చర్చించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు సమావేశంలో నారా లోకేష్ కూడా నేతలతో కలిసి వేదిక కిందే కూర్చున్నారు.. గుంటూరు జిల్లా నేతలతో కలిసి నారా లోకేష్ సమావేశంలో పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com