గురుగ్రహంపై అరుదైన దృశ్యం

గురుగ్రహంపై అరుదైన దృశ్యం

గురుగ్రహంపై అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. జూపిటర్‌పై నీటి జాడలు ఉన్నాయని జూనో ఉప గ్రహం కన్ఫమ్ చేసింది. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా తీసింది. గురుగ్రహ ఉత్తర భాగంలో నీటి ప్రవాహం ఉందని గుర్తిం చారు. చుట్టూ భారీ మేఘాలు సూర్యుడి ఎండకు మెరుస్తున్నాయి. ఐతే నీటి ప్రవాహం మధ్యలో నల్లటి పదార్థముంది. ఆ బ్లాక్ స్పాట్ ఏంటో నాసాకు కూడా అంతుచిక్కలేదు.

నాసా పంపిన జూనో ఉపగ్రహం, గురుగ్రహాన్ని నిశితంగా పరిశోధిస్తోంది. జూపిటర్ చుట్టూ తిరుగుతూ అరు దైన ఫొటోలనూ, వీడియోలనూ పంపుతోంది. మే 29న జూపిటర్ చుట్టూ 20వ సారి తిరుగుతూ ఓ ఫొటో తీసింది. అందులోనే గురుగ్రహంపై నీటి జాడలు బయటపడ్డాయి. ఫొటో తీసినప్పుడు జూనో ఉపగ్రహం, జూపిటర్‌కి 14 వేల 800 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story