ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు

ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు

విశాఖ శారదా పీఠ ఉత్తరాధికారి శిష్య సన్యాసాశ్రమ దీక్షా స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వరూపానంద ఆశీస్సులతో రేపటి నుంచి మూడు రోజులపాటు కృష్ణానదీ తీరాన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరగనుంది. విజయవాడలోని కృష్ణానదీ తీరాన వున్న గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక వేడుక చివరి రోజు కార్యక్రమానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు.. ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వేడుకకు హాజరవుతారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు పరిశీలించారు.

Tags

Next Story