దారుణం.. మహిళను కరెంట్‌ స్తంభానికి కట్టేసి..

దారుణం.. మహిళను కరెంట్‌ స్తంభానికి కట్టేసి..

ఓ మహిళ అని జాలీ చూపలేదు. ఆమె చేసిన తప్పు అంత పెద్దదేమి కాదు. కానీ ఆ మహిళ పట్ల వాళ్లు ప్రవర్తించిన తీరు అందరిని తలదించుకునేలా చేసింది. బెంగళూరులోని కొడిగెహళ్లి ప్రాంతంలో ఓ మహిళను కరెంట్‌ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురి చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇంతకు ఆమె చేసిన తప్పేంటో తెలుసా. తీసుకున్న 50 వేలు అప్పు తిరిగి చెల్లించకపోవడమే. తనకు 50 వేలు అప్పు చెల్లించలేదనే కారణంతో వడ్డీ వ్యాపారి ఆమెను కరెంట్‌ స్తంభానికి కట్టేసి చిత్ర హింసలకు గురి చేశాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. ఈ దారుణాన్ని అందరూ చోద్యం చూస్తూ పోయారే తప్పా.. ఎవరు ఇది అన్యాయం అని అడిగిన పాపాన పోలేదు. ఆ మహిళను విడిపించే ప్రయత్నం చేయలేదు. ఆ మహిళ ఎండకు తాళలేక స్పృహతప్పిపడిపోయానా ఎవరూ కనికరం చూపలేదు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story