వెస్టిండీస్‌పై విజృంభించిన ఇంగ్లండ్

ఆతిథ్య ఇంగ్లండ్ అదరగొడుతోంది. వరస విజయాలతో దూసుకుపోతోంది. శుక్రవారం వెస్టిండీస్‌పై విజృంభించింది. 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ జో రూట్ అజేయంగా సెంచరీ చేయడంతో.. ఇంగ్లండ్ సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 44.4 ఓవర్లలోనే 212 పరుగుల వద్ద ఆలౌటైంది. పూరన్ 63 రన్స్, 39 రన్స్ చేశారు. గేల్ 36 పరుగులకే పరిమితం అయ్యాడు. మిగిలినవారంతా ఘోరంగా ఫెయియ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్3, మార్క్ వుడ్ 3 వికెట్లు తీసి విండీస్‌ను కట్టడి చేశారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు అద్భుత ఆరంభం దొరికింది. గాయం కారణంగా ఓపెనర్ జేసన్ రాయ్ డ్రెసింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు. అతని స్థానంలో ఓపెనర్‌గా జో రూట్.. బెయిర్‌స్టోతో కలిసి బరిలోకి దిగాడు. బెయిర్‌స్టో45 రన్స్ చేసి ఔటయ్యాడు. మరోవైపు జో రూట్ అజేయంగా 100 పరుగులతో విండీస్ బౌలర్లను భయపెట్టారు. అతడికి తోడు వోక్స్ కూడా 40 రన్స్ చేయడంతో ఇంగ్లండ్ సునాయస విజయం సాధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com