ఇద్దరు బీట్‌ కానిస్టేబుళ్ల పైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే..

ఇద్దరు బీట్‌ కానిస్టేబుళ్ల  పైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే..

కడపజిల్లా రాజంపేట మండలం బోయినపల్లె వద్ద దారుణం జరిగింది. బోయినపల్లె వైజంక్షన్‌ వద్ద విధులు నిర్వహిస్తోన్న ఇద్దరు బీట్‌ కానిస్టేబుళ్ల పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆదిమూలం మనోహర్‌ స్పాట్‌లోనే మృతి చెందగా మరో కానిస్టేబుల్‌ రమేష్‌కు గాయాలయ్యాయి. గాయపడ్డ కానిస్టేబుల్‌ రమేష్‌ను చికిత్స కోసం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌ నుంచి తిరుమలకు వెళుతోన్న కారు వేగంగా వచ్చి వీరిద్దరినీ ఢీకొట్టింది. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉండి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ నుంచి తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఈ కారులో తిరుపతి వెళుతున్నారు.

Tags

Next Story