ఎలుకల బాధకు ఇల్లు కాల్చుకున్నట్లే : ఎంపీ రేవంత్‌ రెడ్డి

ఎలుకల బాధకు ఇల్లు కాల్చుకున్నట్లే : ఎంపీ రేవంత్‌ రెడ్డి

తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలనే ఆలోచనను సీఎం కేసీఆర్‌ వెంటనే విరమించుకోవాలని... మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సచివాలయంలో సీఎస్‌ ఎస్‌.కె.జోషిని కలిసి.. ఈ మేరకు లేఖ అందించారు. 100 ఏళ్లుండే భవనాలను 20 ఏళ్లలోపే కూలగొట్టాలని చూడడం ప్రజాధనాన్ని వృధా చేయడం కాక మరేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ వాస్తు పండితుల సూచనలను పాటిస్తూ... ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫైర్‌ సేఫ్టీ లేదన్న కారణంతో భవనాలు కూలగొట్టడమంటే..,. ఎలుకల బాధకు ఇల్లు కాల్చుకున్నట్లే అని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story