తెలంగాణ ఎమ్మెల్యేలకు కొత్త భవనాలు సిద్ధం

తెలంగాణ ఎమ్మెల్యేలకు కొత్త భవనాలు సిద్ధం

రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేల కోసం నిర్మించిన కొత్త భవనాల సముదాయం అన్ని హంగులతో సిద్దమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదర్‌గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ఈ నెల 17న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌ అండ్ బీ ,గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డిలు నూతన భవనాల నిర్మాణాన్ని, ప్రారంభోత్సవ కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు .

హైదరగూడలో సుమారు 4.5 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా ఎంపికైనా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మించారు. 166 కోట్ల రూపాయల వ్యయంతో 12 అంతస్తుల భవనాలను నిర్మించారు . ఈ 12 అంతస్తుల్లో ఎమ్మెల్యేలతోపాటు వారి సిబ్బంది ఉండేదుకు వీలుగా రూపకల్పన చేశారు. ఒక్కో ఎమ్మెల్యే నివాసం 2400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందించారు.

అత్యాధునిక నిర్మాణ శైలితో పాటు జిమ్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇతర వసతులను కల్పించారు. ఎమ్మెల్యేలను కలిసేందుకు వచ్చిన వారికి గెస్ట్ రూంతో పాటు, ఆఫీస్ రూం, డ్రాయింగ్ రూం, విశాలమైన డైనింగ్ హాల్, చుట్టూ గ్రీనరీని ఏర్పాటు చేశారు. పది మంది కూర్చొని భోజనం

చేసేలా డైనింగ్ హాల్‌లను ఏర్పాటు చేశారు. బయట పచ్చికలో కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు.

అయితే 2012 ఆగష్టులో ఈ అపార్ట్‌మెంట్ల నిర్మాణం ప్రారంభం కాగా... 2014 ఫిబ్రవరి నాటికి ఇవి అందుబాటులోకి రావాల్సి ఉంది .అయితే వివిధ కారణాల వల్ల నిర్మాణం అలస్యం అయింది. ఈ భవనాల్లో ఎమ్మెల్యేల నివాసంతో పాటు నియోజకవర్గాల వారీగా క్యాంప్ ఆఫీసులుగా వినియోగించనున్నారు .

Tags

Read MoreRead Less
Next Story