ప్రకాశ్‌రాజ్‌తో ఆమె సెల్ఫీ.. ఇంతలోనే తన భర్త వచ్చి..!

ప్రకాశ్‌రాజ్‌తో ఆమె సెల్ఫీ.. ఇంతలోనే తన భర్త వచ్చి..!

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ లో ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు. తనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన ఓ మహిళ పట్ల ఆమె భర్త ప్రవర్తించిన తీరును ఆయన తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'ఇటీవల ఆయన కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో పర్యటించాను. ఆ సమయంలో నన్ను చూసిన ఓ మహిళ తన కూతురును తీసుకొనే వచ్చి సెల్ఫీ కావాలని అడిగింది. వెంటనే సంతోషంగా వారికీ సెల్ఫీ ఇచ్చాను. ఇంతలో ఆ మహిళ భర్త వచ్చి ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు నాతో దిగిన ఫోటోను డిలీట్ చెయ్యమని ఆదేశించాడు. ప్రకాష్ రాజ్ మోదీని చాలాసార్లు విమర్శించాడు అతనితో సెల్ఫీ ఏంటని భార్యను తిట్టాడు. పర్యాటకులంతా ఆమెవైపే చూస్తున్నారు.. దానికి ఆమె ఏడ్చింది.

ఇంతలో నేను అతన్ని పక్కకు పిలిచి మాట్లాడాను.. "ప్రియమైన సార్ .. మిమ్మల్ని మీ భార్య వివాహం చేసుకోవడానికి మిస్టర్ మోడీ లేదా నేను కారణం కాదు..అద్భుతమైన కుమార్తెను మీకు ఇచ్చి మీతో జీవితాన్ని పంచుకున్నారు. వారు మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నందున దయచేసి వారి అభిప్రాయాలను గౌరవించండి.. మీ పర్యటనను ఆస్వాదించండి" అనే సరికి అతను సమాధానం లేకుండా నిలబడి ఉన్నాడు.. నేను భారమైన హృదయంతో వెళ్ళిపోయాను .. ఆశ్చర్యపోతున్నాను .. అతను నా ఫోటోను తొలగించవచ్చు లేదా తొలగించకపోవచ్చు .. కానీ వారి గాయం నయం చేస్తాడా' అని ట్వీట్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story